Prabhas : వన్ అండ్ ఓన్లీ ప్రభాస్‌

Prabhas : వన్ అండ్ ఓన్లీ ప్రభాస్‌
X

ప్రస్తుతం ఇండియాలోనే అత్యంత డిమాండ్‌ ఉన్న స్టార్ ఎవరంటే ప్రభాస్‌ అనే చెప్పాలి. బాహుబలి నుంచి కల్కి 2898ఏడీ ఆయన రేంజ్ ఏ రేంజ్ కి చేరిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన జెట్‌ స్పీడ్ లో సినిమాలు చేస్తున్నారు. వాటిలో మారుతి ‘రాజాసాబ్‌’, హను రాఘపూడి ‘ఫౌజీ’, సందీప్‌రెడ్డి ‘స్పిరిట్‌’, ప్రశాంత్‌ నీల్‌ ‘సలార్‌ 2’, నాగ్‌ అశ్విన్‌ ‘కల్కి 2’ సినిమాలు ఉన్నాయి. ఇదిలావుంటే ఈ వేగాన్ని మరింత పెంచుతూ కన్నడ సినీరంగంలో కదం తొక్కబోతున్నాడు ప్రభాస్. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ లో ప్రభాస్ ఇప్పటికే ‘సలార్‌ 2’ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అదే సంస్థలో మరో రెండు సినిమాలు చేయడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఆ సినిమాలేంటి? దర్శకులెవరు? అనే అంశాలపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇప్పుడు ఈ రేంజ్ లో సినిమాలు చేస్తున్న వన్ అండ్ ఓన్లీ హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు ప్రభాస్.

Tags

Next Story