Kalki 2898 AD : బుజ్జిని చూపించిన ప్రభాస్.. సూపర్ హీరో ఎంట్రీ

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్యాన్ వరల్డ్ మూవీ కల్కి 2898 ఏడీ స్పెషల్ ఈవెంట్ బుధవారం రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీలో సందడిగా నిర్వహించారు. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ప్రచారంలో భాగంగా కీలకమైన బుజ్జి అనే ప్రత్యేక వాహనాన్ని అభిమానుల సమక్షంలో ఆవిష్కరించారు.
బుజ్జిని ఇంట్రడ్యూస్ చేస్తూ ప్రభాస్ ఆ వాహనాన్ని నడుపుకుంటూ వచ్చి ఇసుకలో తిప్పుడం హైలైట్ గా చెప్పుకోవచ్చు. దానినుంచి దిగి రౌడీలను ఒక్క పంచ్ తో దెబ్బకొడతాడు. ఆ తర్వాత.. ఫిలింసిటీ ఫ్యాన్స్ అరుపులతో దద్దరిల్లింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె తదితరులు నటించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ప్రభాస్.. అమితాబ్, కమల్ హాసన్లను చూసి చిత్ర పరిశ్రమ స్పూర్తి పొందిందనీ.. ఈ చిత్రంలో వారి తో కలిసి నటించడం గర్వంగా ఉందని అన్నాడు. ఇలాంటి అవకాశం కల్పించిన దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత సి.అశ్వనీదత్లకు థాంక్స్ చెప్పాడు. సాగరసంగమంలో కమల్ వేసుకున్న దుస్తులు వచ్చి అలాంటి వాటిని కొనివ్వమని తన అమ్మను అడిగేవాడినననీ.. ఆయన నటనకు వేయి దండాలన్నాడు ప్రభాస్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com