Pradeep Machiraju : యాంకరింగ్‌కి ప్రదీప్ గుడ్ బై.. ఏం చేస్తున్నాడంటే..!

యాంకర్ గా ప్రదీప్ మాచిరాజు (Pradeep Machiraju) కనిపించడం లేదు. అసలు ఏం చేస్తున్నాడు.. అనేది ఇపుడు బుల్లితెర సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ. ప్రదీప్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.
యాంకర్ ప్రదీప్ టోటల్ గా యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేశాడన్న టాక్ అంతటా వినిపిస్తోంది. ఇదే మూమెంట్లో ప్రదీప్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ప్రదీప్ జిమ్లో విపరీతంగా కష్టపడుతున్నాడు. అతడు కండలు తిరిగిన శరీరం కలిగి ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
వావ్ అనిపించేలా.. తన కమ్ బ్యాక్ ఉండాలని ప్రదీప్ భావిస్తున్నాడట. అందుకే అందరికీ కనిపించకుండా సీక్రెట్ గా కసరత్తు చేస్తున్నాడట. ఇప్పుడు ప్రదీప్ మేక్ ఓవర్ చూసి జనాలు షాక్ అయిపోతున్నారు. ప్రదీప్ త్వరలోనే హీరోగా రాబోతున్నాడు అని.. ఆ కారణంగానే యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేసి బాడీని ఫిట్ గా మార్చుకొని ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్నాడు అని ఫ్యాన్స్ చెప్తున్నారు. కొత్త రోల్ లో సక్సెస్ అవుతాడా లేదా చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com