Viral : ప్రగతీ ఆంటీ కొత్త వీడియో.. సోషల్ మీడియా షేక్

Viral : ప్రగతీ ఆంటీ కొత్త వీడియో.. సోషల్ మీడియా షేక్

క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఆమెకు ఓ వర్గం మూవీ లవర్స్ నుంచి సపోర్ట్ ఎప్పుడూ కనిపిస్తుంటుంది. హీరోయిన్ తల్లిగా స్టార్ హీరోలకు భార్యగా వదినగా ఇలా మంచి మంచి పాత్రలో నటించి మెప్పించింది. ఆమె డైలాగ్ డిక్షన్ చాలామందికి నచ్చుతుంటుంది.

ఈ మధ్యకాలంలో ఆమె సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ జిమ్ వీడియోలను ఎక్కువగా షేర్ చేస్తూ వచ్చింది. మరీ ముఖ్యంగా లాక్ డౌన్ టైం లో ప్రగతి ఆంటీ పేరు బాగా పాపులారిటీ సంపాదించుకుంది. నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియో పెడుతూ తన పేరు హైలెట్ అయ్యేలా చేస్తుంది.

జిమ్ కి వెళ్లి కసరత్తు చేయడం.. శారీస్ లో ఎక్సర్ సైజ్ లు చేయడం ఆమె ప్రత్యేకత. వెయిట్ లిఫ్టింగ్ లోనూ ఈమె ఓ పతకం గెల్చుకుంది. బనియన్ మీద.. గల్లీలో బైక్ నడుపుతూ షర్ట్ లేకుండా చేసిన వీడియో వైరల్ అవుతోంది. కొంతమంది ఆమె డ్రైవింగ్ కి ఫిదా అవుతుంటే.. మరి కొంతమంది లేడీ టైగర్ అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story