Prasad Komalee : రోజూ బిర్యానీ తినిపిస్తేనే పెళ్లి చేసుకుంటా : ప్రసాద్ కోమలి

'నేను సీతాదేవి' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ ప్రసాద్ కోమలి. అనంతరం పలు చిత్రాల్లో ఈ బ్యూటీ నటించి మెప్పిం చింది. తెలుగమ్మాయి అయిన ప్రసాద్ కోమలి.. తన నటనతో వరుస అవకాశాలు దక్కిం చుకుంటోంది. రీసెంట్ గా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈ అమ్మడు.. తనకు కాబోయే భర్త గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
చిట్ చాట్ లో తన అభిరుచులు, ఇష్టాల గురించి మాట్లాడింది. తనకు బిర్యానీ అంటే చాలా ఇష్టమని చెప్పు కొచ్చింది. రోజూ ఒక పూట బిర్యానీ తినిపించే వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని వ్యాఖ్యానించింది. అలాగే రోజూ అతడు జోక్స్ చెబుతూ నవ్విస్తూ ఉండాలని పేర్కొంది. తెలుగు అమ్మాయిలకు ఆఫర్లు రావు అంటారు.
కానీ తాను తెలుగమ్మాయిని అవ్వడం వల్లే కొన్ని ఆఫర్లు వచ్చాయని తెలిపింది. ప్రస్తుతం కోమలి నటించిన శశివదనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. రక్షిత్ అట్లూరి ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ఏప్రిల్ 19న ఈ సినిమా విడుదల కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com