Prashant Neel : సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ అసంతృప్తి

Prashant Neel : సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ అసంతృప్తి
X

ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఆ మధ్య వచ్చిన సలార్ మూవీ సృష్టించిన బాక్సాఫీస్ సక్సెస్ ఎవరూ మరిచిపోలేరు. ఐతే.. మూవీకి కొంత డివైడ్ టాక్ రావడంతో.. వెయ్యి కోట్ల వసూళ్లు దాటలేకపోయింది ఈ మూవీ. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. 'సలార్' విడుదల అయి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రశాంత్ నీల్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన ప్రశాంత్ నీల్... 'సలార్' సక్సెస్ ను తాను ఎంతో ఊహించానని... కానీ, వచ్చిన రిజల్ట్ పట్ల తాను పూర్తిగా తృప్తిగా లేనని చెప్పారు. 'కేజీఎఫ్' బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత వచ్చిన సినిమా కావడంతో 'సలార్' పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారని ప్రశాంత్ నీల్ తెలిపారు. అయితే, ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను తాను అందుకోలేకపోయాననే భావన తనలో ఉందని చెప్పారు. సినిమా విడుదలయిన తర్వాత థియేటర్లలో వచ్చిన రిజల్ట్ పట్ల తాను సంతోషంగా లేనని అన్నారు. 'సలార్-2' మాత్రం గురి తప్పదని... సీక్వెల్ కోసం కథను పక్కాగా రెడీ చేశానని .. ఇప్పటి వరకు చేసిన సినిమాలలో 'సలార్-2' బెస్ట్ గా నిలుస్తుందని నమ్మకంగా చెప్పగలనని అన్నారు. ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Tags

Next Story