Premalu Song : 'ప్రేమలు' పాట.. 28 ఏళ్ల కిందటి దేవరాగం కీరవాణి పాట వైరల్..

1990స్ లో తెలుగులో వచ్చిన క్లాసికల్ మెలోడీలు ట్రెండింగ్ లోకి వస్తున్నాయి. ఇన్ స్టాలో ఈ పాటల ట్రెండ్ ను గమనించవచ్చు. ఐతే.. ఆస్కార్ విన్నర్ కీరవాణి కూడా తన వేల పాటల్లోని కొన్ని ఆణిముత్యాలను రీలాంచ్ చేస్తూ నేటితరం యూత్ ను అలరిస్తున్నారు. అలా.. రీసెంట్ క్లాసికల్ హిట్ మలయాళం మూవీ 'ప్రేమలు'లోనూ ఓ మ్యాజిక్ ను రిపీట్ చేశారు కీరవాణి.
ప్రేమలు తెలుగు ప్రేక్షకులని కూడా బాగానే అలరించింది. ముఖ్యంగా మల్టీ ఫెక్ల్స్ లో సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎస్ఎస్ కార్తికేయ తెలుగులో విడుదల చేశారు. 'ప్రేమలు'తో కీరవాణికి ఉన్న పాత అనుబంధమే వైరల్ గా మారిన యాదవ పాట. ఈ పాట ఒరిజినల్ కంపోజ్ 28 ఏళ్లకిందటే చేశారు కీరవాణి. 1996లో మలయాళం సినిమా 'దేవరాగం' కోసం కీరవాణి స్వరపరిచిన పాటిది. అందులో శ్రీదేవి, అరవింద్ స్వామి జంటగా నటించారు.
తెలుగులోనూ ఈ పాట సూపర్ హిట్. మెలోడీ ప్రేమికులు ఈ పాటను తరచుగా హమ్ చేస్తుంటారు. య య య.. నెమలి కన్నుల కలయా.. అంటూ సాగే పాటను ఎవరు మాత్రం మరిచిపోగలరు.
ఇప్పుడు అదే పాటని 'ప్రేమలు' సినిమాలో చాలా చక్కగా ప్లేస్ చేశారు. ఈ పాట వస్తున్నంత సేపు థియేటర్స్ లో ఓ ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. అప్పటి దేవరాగంలో ఈ పాటని ఎంతలా ఎంజాయ్ చేశారో గానీ,. ఇప్పటి యూత్ మాత్రం అ పాటని తెగ అస్వాదిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com