Premikudu Re-Release : ప్రభుదేవా ప్రేమికుడు రీరిలీజ్ .. ఎప్పుడంటే ?

ప్రభుదేవా (Prabhudeva) హీరోగా, నగ్మా హీరోయిన్ గా రూపొందిన చిత్రం 'ప్రేమికుడు' (తమిళంలో 'కాదలన్'). శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 1994లో విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. కేవలం మూడు కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 15 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ మూవీలోని 'ముక్కాలా ముక్కాబులా', 'ఊర్వశి ఊర్వశి', 'ఓ చెలియా నా ప్రియ సఖియా', 'అందమైన ప్రేమరాణి'.. వంటి పాటలన్నీ యువతను ఉర్రూతలూగించాయి.
క్లాసిక్ హిట్ గా రూపొందిన 'ప్రేమికుడు' తెలుగులో రీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. తెలుగు రీ రిలీజ్ హక్కులను నిర్మాతలు మురళీధర్ రెడ్డి, రమణ దక్కించుకున్నారు. సీఎల్ఎన్ మీడియా ద్వారా త్వరలో సినిమా రిలీజ్కు సన్నాహాలు చేస్తు న్నారు. అతి త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తామని నిర్మాతలు పేర్కొన్నారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత రీరిలీజ్ అవుతున్న ఈ మూవీ.. ఇప్పుడు ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com