Cannes Film Festival: మూడు దశాబ్దాల తర్వాత కేన్స్‌లో మనకు అరుదైన గౌరవం

మన భారతీయ సినిమా మరోసారి అంతర్జాతీయ వేదికపై పవర్ ఫుల్ పంజా విసిరింది. ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత తొలిసారి ఇండియన్ సినిమాకు చోటు లభించింది. పాయల్ కపాడియా డైరెక్షన్లో తెరకెక్కించిన ‘అల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ కేన్స్ పామ్ డి ఓర్ అవార్డుకు నామినేట్ అయింది.
పాయల్ కపాడియా తెరకెక్కించిన మొదటి ఫిక్షన్ చిత్రమిది. ఈ ఏడాది మే 14 నుంచి 25 వరకు జరగనున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అత్యున్నత పురస్కారాల కోసం పోటీలో నిలిచింది. దాదాపుగా పామ్ డి ఓర్ అవార్డు కోసం పోటీ పడుతున్న మొదటి భారతీయ చిత్రం ఇదే కావడం విశేషం. 1994లో షాజీ ఎన్ కరుణ్ తెరకెక్కించిన ‘స్వహం’ మూవీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికైంది.
గతంలో పాయల్ కపాడియా డాక్యుమెంటరీ ‘ఏ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’ 2021 ఎడిషన్లో ఉత్తమ డాక్యుమెంటరీగా గోల్డెన్ ఐ అవార్డ్ గెలుచుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com