Priyanka Chopra : హాలీవుడ్ కో స్టార్ కి ప్రియాంక ప్రశంసలు

Priyanka Chopra : హాలీవుడ్ కో స్టార్ కి ప్రియాంక ప్రశంసలు
X

హాలీవుడ్ నటి, నిర్మాత యాంజెలినాను ఆమె కూతురు వివియన్నేను బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ( Priyanka Chopra ) ప్రశంసలతో ముంచెత్తింది. హాలీవుడ్ మూవీ 'ది ఔట్ సైడర్' కు ఉత్తమ సంగీతానికి గాను యాంజెలినాకు ప్రతిష్టాత్మక టోనీ అవార్డు లభించడంతో యాంజెలీనా, వివియన్నేను అభినందిస్తూ.. ఇన్ స్టాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టింది. తన స్నేహితురాలు, సహోద్యోగి సాధించిన విజయానికి ఆనందిస్తున్నానని రాసుకొచ్చింది.

వారి నుంచి స్ఫూర్తి పొందుతానని చెప్పుకొచ్చింది. ఇకపోతే యాంజెలీనా. తన కుమార్తె, సంగీత దర్శకురాలు వివియన్నేతో కలిసి ఫస్ట్ టైమ్ ఓ సినిమాకు పని చేసింది. ది అవుట్ సైడర్ సిరీస్. ఎస్. ఇ రాసిన నవల ఆధారంగా రూపొందించిన మ్యూజికల్ డ్రామా. సంగీతంలో పోటీ కోసం రెండు ప్రత్యర్థి ముఠాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

కాగా బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ప్రియాంక చోప్రా.. అనంతరం నిక్ జోనాసన్ను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిలైన విషయం తెలిసిందే. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. గత కొంత కాలంగా హిందీ సినిమాలకు దూరంగా ఉన్న ప్రియాంక చోప్రా..

వరుస హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది.

Tags

Next Story