Bandla Ganesh : బండ్లన్న కం బ్యాక్.. అభిమానులు ఫుల్ ఖుషి...!

Bandla Ganesh : బండ్లన్న కం బ్యాక్.. అభిమానులు ఫుల్ ఖుషి...!
బండ్ల గణేష్... తెలుగు వెండితెరకి పెద్దగా అక్కరలేని పేరు. కమెడియన్‌‌గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత నిర్మాతగా మారాడు.

బండ్ల గణేష్... తెలుగు వెండితెరకి పెద్దగా అక్కరలేని పేరు. కమెడియన్‌‌గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత నిర్మాతగా మారాడు. స్టార్ హీరోలతో సినిమాలు చేసి బడా ప్రొడ్యూసర్‌‌గా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నాడు. సినిమాల కన్నా ఎక్కువగా మాటలతో ఫేమస్ అయ్యాడు గణేష్.. అటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గానే ఉంటాడు గణేష్. సోషల్ మీడియాలో ఆయన పెట్టే పోస్టులు ఎప్పుడూ కాంట్రవర్సరీలు అవుతూనే ఉంటాయి. దీంతో తాజాగా ట్విట్టర్ కి గుడ్ బై చెప్పబోతున్నానంటూ బండ్ల గణేష్‌ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బండ్ల గణేష్‌ మనసు మార్చుకున్నారు. ఓ జర్నలిస్ట్ ఇచ్చిన సలహా మేరకు ట్విటర్‌లో తిరిగి కొనసాగాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు గణేష్. మళ్ళీ బండ్ల ట్విట్టర్ లోకి బ్యాక్ రావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.


Tags

Next Story