Namitha : నిర్మాత మోసం చేశాడు.. చేదు అనుభవాల్ని బయటపెట్టిన నమిత

టాలీవుడ్ తో పాటు తమిళ్, కన్నడ, మళయాళం, హిందీ ఇలా ఎన్నో భాషల సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ నమిత. గుజరాత్ లో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ.. సొంతం సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక కొన్నాళ్ల క్రితమే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తూ.. బీజేపీ పార్టీలో చేరింది ఈ బ్యూటీ. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నమిత.. తన కెరీర్లో ఎదురైన రెండు మోసాల్ని గురించి వెల్లడించింది.
ధనుష్ హీరోగా ప్రాజెక్ట్ చేస్తున్నామని చెప్పి ఓ నిర్మాత తన కాల్షిట్ తీసుకున్నాడని.. కానీ చివరకొచ్చేసరికి ఆయన కజిన్ హీరోగా నటించాడని చెప్పుకొచ్చింది. ఆ విషయం తనకు తెలియగానే చాలా బాధపడి సగంలోనే ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చేశానని ఆవేదన వ్యక్తం చేసింది. ఆపై ఎలాగోలా సినిమా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేసినట్లు పేర్కొంది.
దీనిపై అప్పట్లో నిర్మాతల మండలి, నటీనటుల మండలిలో ఫిర్యాదు కూడా చేసినట్లు నమిత వెల్లడించింది. అలానే మలయాళంలోనూ పేరున్న నిర్మాత ఉన్నారు కదా అని ఓ ప్రాజెక్ట్ సైన్ చేశానని.. కానీ దాన్ని వేరే నిర్మాత తీసుకోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వివరించింది. దాన్ని కూడా ఎలాగోలా పూర్తి చేసినట్లు తనకెదురైన చేదు అనుభవాల్ని నమిత పంచుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com