Bollywood Producer : బాలీవుడ్ ప్రముఖ నిర్మాత మృతి

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత సలీమ్ అక్తర్(87) నిన్న అర్ధరాత్రి మరణించారు. అనారోగ్య సమస్యలతో ముంబైలోని ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రాణీ ముఖర్జీ, తమన్నా వంటి స్టార్ హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈయనే. ఆమిర్ ఖాన్, బాబీ డియోల్, మిథున్ చక్రవర్తి తదితర అగ్ర నటులతో సినిమాలు చేశారు. కాగా ఇటీవల ప్రముఖ ప్రొడ్యూసర్ మనోజ్ కుమార్ కూడా మృతిచెందిన విషయం తెలిసిందే.
సినీ ఇండస్ట్రీకి ఎన్నో సేవలు చేసిన సలీమ్.. (1983) లో ఖయామత్, (1993) లో ఫూల్ ఔర్ అంగారే, ఆద్మీ (1993), రాజా కీ ఆయేగీ బారాత్ (1997) వంటి సినిమాలను నిర్మించి మంచి సక్సెస్ ను సొంతం చేసుకున్నాడు. ఇక రాణీ ముఖర్జీ, తమన్నా వంటి స్టార్ హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఆయనే. అంతే కాదు అమీర్ ఖాన్, బాబీ డియోల్, మిథున్ చక్రవర్తి తదితర ఎంతో మంది స్టార్ హీరో హీరోయిన్ లను ఆయన సినిమాల ద్వారా పరిచయం చేశారు.
ఒక మాటలో చెప్పాలంటే బాలీవుడ్ ఇండస్ట్రీకి ఒకప్పుడు లెజెండ్ నిర్మాతనే చెప్పాలి. అలాంటి ఆయన చనిపోవడం ఇండస్ట్రీలోని ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. సలీమ్ తో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరు ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతూ తన కుటుంబాన్ని ధైర్యం చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com