Producer Preetish Nandi : ప్రముఖ నిర్మాత ప్రితీశ్ నంది కన్నుమూత

ప్రముఖ రచయిత, నిర్మాత ప్రితీశ్ నంది(73) కన్నుమూశారు. తానొక మంచి స్నేహితుడిని కోల్పోయానంటూ ఈ విషయాన్ని నటుడు అనుపమ్ ఖేర్ ఇన్‌స్టా ద్వారా తెలిపారు. ప్రితీశ్ తన నిర్మాణ సంస్థ ద్వారా ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్, మీరాబాయ్ నాటౌట్, అగ్లీ ఔర్ పాగ్లీ, షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ వంటి చిత్రాలు నిర్మించారు. జర్నలిస్టుగానూ సుపరిచితుడైన ప్రితీశ్ రాజ్యసభ ఎంపీగానూ వ్యవహరించారు. ప్రితీశ్ తన నిర్మాణ సంస్థ ద్వారా ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్, మీరాబాయ్ నాటౌట్, అగ్లీ ఔర్ పాగ్లీ, షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ వంటి చిత్రాలు నిర్మించారు. జర్నలిస్టుగానూ సుపరిచితుడైన ప్రితీశ్ టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి తదితర సంస్థల్లో పని చేశారు. ది ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా ఎడిటర్‌గా పనిచేశారు. నంది యొక్క సాహిత్య రచనలకు కూడా ఎంతో పేరు వచ్చింది. పాత్రికేయ, సాహిత్య రంగాలకు అతీతంగా సినీ నిర్మాతగా కూడా నంది తనదైన ముద్ర వేశారు. గతంలో ఆయన రాజ్యసభ ఎంపీగానూ వ్యవహరించారు. జంతు హక్కుల కోసం పోరాడారు. జంతు సంక్షేమ సంస్థ అయిన పీపుల్ ఫర్ యానిమల్స్ సహ వ్యవస్థాపకుడిగా ప్రితీశ్ నంది ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com