Pushpa2 : పుష్ప 2 పిచ్చెక్కించే అప్ డేట్

"పుష్ష 2' (Pushpa 2) కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 15న 'పుష్ష 2'ని విడుదల చేయడం కోసం మేకర్ సుకుమార్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. అక్కడ ఇంట్రవెల్ ఎపిసోడ్ తెరకెక్కిస్తున్నారు. వందలాదిమంది జూనియర్ ఆర్టిస్టులు, ప్రధాన తారాగణం ఈ షూటింగ్ లో పాలు పంచుకొంటున్నారు.
ఈ ఇంటర్వెల్ బ్యాంగ్ గురించి ఇప్పుడు ఇండస్ట్రీ అంతా చెప్పుకుంటున్నారు. అలవైకుంఠపురములో, యానిమల్ లాంటి కొన్ని సినిమాల్లో డైరెక్టర్లు లో పాటలు, ఫైట్లు కలగలిపి తీస్తున్నారు. అలాగే.. కొంచెం వెరైటీగా.. పాట, ఫైట్.. ఎమోషన్ సీన్స్… ఇలా అన్నీ మేళవించి, ఇంటర్వెల్ బ్యాంగ్ ను తీర్చిదిద్దుతున్నట్టు న్యూస్. ఇంట్రవెల్ బ్యాంగ్ ఈ సినిమాని ఓ రేంజ్‌లో తీసుకెళ్లి కూర్చోబెట్టబోతోందని, ఈ ఎపిసోడ్ కోసం భారీగా ఖర్చు పెడుతున్నారని తెలుస్తోంది.
విదేశాల్లో ఉన్న బన్నీ తిరిగి వచ్చేవరకు మిగతా సీన్లు తీస్తారట. బన్నీ వచ్చాక మరిన్ని కీలక సీన్లు తీస్తే షూట్ అయిపోతుందట. దేవిశ్రీ అందించి పాటలు త్వరలోనే విడుదల కానున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com