ఒటీటీలో కి పీవీ బయోపిక్.. ఎందులో స్ట్రీమింగ్ అంటే ?

ఒటీటీలో కి పీవీ బయోపిక్.. ఎందులో స్ట్రీమింగ్ అంటే ?

మాజీ భారత ప్రధాని పి.వి. నరసింహ రావు బయోపిక్ ను పాన్ ఇండియా సిరీస్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాను న్నట్లు ఆహా ఒటిటి అధికారికంగా ప్రకటించింది.. మాజీ భారత ప్రధాని పివికి ఇటీవల దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించిన సంగతి తెలిసిందే. 1991 నుంచి 1996 వరకు ఆయన అందించిన విశేషసేవలకుగానూ భారత ప్రభుత్వం ఆయనకు దేశంలోనే అత్యున్నతమైన పౌర పురస్కారం భారతరత్న అవార్డును ప్రకటించింది.

భారతదేశ ఆర్థిక వ్యవస్థను మార్చి కొత్తపుంతలు తొక్కించటంలో ఆయనెంతో కీలకంగా వ్యవహరించారు. ఇక ఆయన గురించి, ఆయన చేసిన సేవల గురించి ప్రేక్షకులు తెలుసుకోవడానికి.. ఆహా స్టూడియో అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ తో కలిసి భారతర త్నఅవార్డు గ్రహీతపి.వి. బయోపిక్ హాఫ్ లయన్ పేరుతో తెరకెక్కించనుంది.

పలు భాషలలో రూపొందుతున్నఈ బయోపిక్ పి.వి జీవిత చరిత్రను వివరిస్తుంది. ప్రముఖ రచయిత వినయ్ సీతాపతి రచించిన హాఫ్ లయన్ పుస్తకం ఆధారంగా.. జాతీయ అవార్డు గెలుచుకున్న ప్రకాష్ ఝా ఈ సిరీస్కు రూపోందిస్తు న్నారు. ప్రస్తుతం ఈ పాన్ ఇండియాన్ సిరీస్ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ సిరీస్ ను విడుదల చేయబోతున్నారు. త్వరలోనే ఈ సిరీస్ కు సంబందించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story