Raashi Khanna : ఆ సినిమా చేయడానికి ఇబ్బంది పడ్డా : రాశీఖన్నా

'ఊహలు గుసగుసలాడే' సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయమైంది రాశీఖన్నా. తన మొదటి సినిమాతోనే ఇక్కడి సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం మరికొన్ని సినిమాలతో పాటు బెంగాల్ టైగర్, సుప్రీం, జై లవకుశ, తొలి ప్రేమ, వెంకీ మామా, ప్రతి రోజు పండగే వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఆ తర్వాత వరుస పరాజయాలు పలకరించడంతో టాలీవుడికి కాస్త దూరమైంది.
ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలపై ఎక్కువ దృష్టి సారించింది. అయితే ఈ బ్యూటీ ప్రధాన పాత్రలో నటించిన బాక్ సినిమా ఇవాళ విడుదల కానుంది. ఇటీవలె ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న రాశీ ఖన్నా.. కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇప్పటి వరకు తాను చేసిన సినిమాల్లో మారుతి డైరెక్షన్లో వచ్చిన ప్రతి రోజూ పండగే మూవీ కాస్త ఇబ్బందిగా, కష్టంగా అనిపించినట్లు చెప్పుకొచ్చింది.
ఆ సినిమా లోని ఏంజిల్ ఆర్నా పాత్ర గురించి చెప్పిన సమయంలో ఆ పాత్ర నేను చేయగలనా అనే భయం వేసిందని వెల్లడించింది. అందులో చాలా విభిన్నంగా బాడీ లాంగ్వేజ్ ఉండాల్సి ఉంటుందని.. అంతే కాకుండా ఆ పాత్రకి చాలా మంది కనెక్ట్
అవుతారు కనుక చేయడం ఎలా అని భయపడ్డానని తెలిపింది. ఆ పాత్రను ఛాలెంజ్ తీసుకుని.. మారుతి గారి ఇన్ ఫుట్ ను ఉపయోగించుకుని నటించానని పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com