Rashi Khanna : రంగులు చల్లుకుంటూ డీజే పాటలకు చిందులేసేదాన్ని : రాశీ ఖన్నా

బాలీవుడ్ మూవీ 'మద్రాస్ కెఫె' సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రాశీఖాన్నా. అనంతరం టాలీవుడ్ లోనూ పలు సినిమాల్లో ఈ అమ్మడు నటించింది. తమిళ సినిమాల్లోనూ యాక్ట్ చేస్తోంది. చబ్బీ లుక్ తో సౌత్ ఆడియన్స్ ఆకట్టుకున్న రాశీఖన్నా.. అనంతరం నాజుగ్గా మారి నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. తాజాగా చిన్నప్పటి హోలీ పండగ జ్ఞాపకాలను రాశీఖన్నా నెమరు వేసుకుంది.హోలీ పండగ రాగానే రూర్కీలోని ఆమె అత్తయ్య ఇంటికి వెళ్లేదని చెప్పుకొచ్చింది.
కజిన్స్ అందరూ వచ్చేవాళ్లని.. దాంతో ఇళ్లంతా సందడిగా ఉండేదని తెలిపింది. రంగులు చల్లుకుంటూ డీజే పాటలకు చిందులేసేవాళ్లమని పేర్కొంది. అటుగా రోడ్డుమీద వెళ్లే మిగతా డీజేల గ్యాంగ్ తోనూ కలిసిపోయో వారమని గుర్తు చేసుకుంది. అలసి పోయో వరకు డాన్స్ చేసేవాళ్లమని తెలిపింది. హోలీనాడు పసుపు రంగు రంగులు బట్టలు ధరించడానికి ఎక్కువ ఇష్టపడతామని రాశీఖన్నా వెల్లడించింది. స్నేహితులంతా ఒకే చోట ఉంటే ఆ అల్లరి ఏ మాత్రం తగ్గదని.. కానీ ఇప్పుడంతా ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యారని చెప్పుకొచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com