Rajamouli : జపాన్ లో 83 ఏళ్ల వృద్దురాలి నుంచి అరుదైన గిఫ్ట్ అందుకున్న రాజమౌళి

Rajamouli : జపాన్ లో 83 ఏళ్ల వృద్దురాలి నుంచి అరుదైన గిఫ్ట్ అందుకున్న రాజమౌళి

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి (SS Rajamouli) జపాన్‌లో (Japan) అరుదైన గౌరవం దక్కింది. ఆయన డైరెక్షన్‌లో రూపొందిన RRR మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్వయంగా రాజమౌళి హాజరయ్యారు. జపాన్‌లో అభిమానుల ప్రశంసల్లో ముద్దైన ఆయన ట్వీట్ చేశారు. ఓ వృద్దురాలు తనపై ప్రేమను కురిపిస్తూ అందించిన బహుమతిని ట్వీట్ చేసి తన భావాలను పంచుకొన్నారు.

ఓరిగామి క్రేన్స్‌తో రూపొందించిన ఓ బహుమతిని అందించారు. తాము ప్రేమించే వారికి ఆరోగ్యం, అదృష్టం లభించాలని ఇలాంటి బహుమతులను అందిస్తారు. RRR సినిమా తనకు గొప్ప అనుభూతిని ఇచ్చినందుకు 83 సంవత్సరాల ముసలావిడ నాకు బహుమతి అందించింది. ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయకుండా తనకు గిఫ్ట్‌ను ఇచ్చేందుకు బయటవేచి ఉండటం నన్ను కదిలించింది అని రాజమౌళి తన ట్వీట్‌లో తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story