Rajasaab Release Date : రాజాసాబ్ రిలీజ్ డేట్ ఫిక్స్

రెబల్ స్టార్ ప్రభాస్, మారుతీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ హారర్ మూవీ 'ది రాజా సాబ్ ' మాళవిక మోహనన్, రిద్ది కుమార్, సంజయ్త్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీనిని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండగా,, థమన్ మ్యూజిక్అందిస్తున్నాడు. భారీ అంచనాల మధ్య రానున్న ఈచిత్రంపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన వీడియోలు, పోస్టర్లు సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఈక్రమంలో ఈ సినిమా అప్ డేట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కోసం మూవీ మేకర్స్ అదిరిపోయే న్యూస్ చెప్పారు ఈనెల 16న ఉదయం 10 గంటల 52 నిమిషాలకు ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్‌చేశారు. ఈ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ అద్భుతమైన కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. మరోవైపు రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ డైరెక్టర్ మారుతీ పోస్ట్ పెట్టారు. 'మీ అందరకీ ప్రామిస్ చేసినట్లే మీరు కోరుకున్నట్లు ప్రభాస్ ను బిగ్ స్క్రీన్‌పై చూస్తారు. ఆరోజు అభిమానులకు పండగే. మీలో జోష్ నింపేందుకు మరిన్ని అప్డేట్స్ రానున్నాయి' అంటూ అని క్యాప్షన్ ఇచ్చాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com