Raja Saab Teaser : జూన్ 6న రాజాసాబ్ టీజర్?

Raja Saab Teaser : జూన్ 6న రాజాసాబ్ టీజర్?
X

డార్లింగ్ హీరో ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ రాజాసాబ్. ఏప్రిల్ లో రిలీజ్ అవుతుందన్న చిత్రం రిలీజ్ కాకపోవడంతో? ఆ సినిమా గురించి మళ్లీ పెద్దగా డిస్కషన్ జరగలేదు. రిలీజ్ అయినప్పుడే చూసుకుందాం అన్న ధోరణిలో అభిమానులంతా సైలెంట్ అయిపోయారు. తాజాగా 'రాజాసాబ్' అభిమానులకు ఓ గుడ్ న్యూస్. ఈ సినిమా టీజర్ జూన్ 6న రిలీజ్ చేస్తున్నట్లు తెలిసింది. దీంతో టీజర్ ఎలా ఉండబోతుందఅన్న ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ప్రభాస్ లుక్...కొన్ని గ్లింప్స్ రిలీజ్ అయ్యాయి. వాటికి మంచి రెస్పా న్స్ వచ్చింది. మారుతి కంటెంట్ పై వాటితోనే బజ్ తీసు కొచ్చాడు. కానీ సినిమా డిలే అయ్యే సరికి ఆ బజ్ కూడా తగ్గిపోతుంది. ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్, రిద్దీకుమార్, యోగి బాబు, మురళీ శర్మ, అనుపమ్ ఖేర్, వెన్నెల కిషోర్ ఇతర తారాగణం గా ఉన్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న రొమాంటిక్, కామెడీ, హర్రర్ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.

Tags

Next Story