Rajasab : రాజాసాబ్.. పెద్దపనే.. ఈ ఏడాది రిలీజ్ అవుతుందా?

Rajasab : రాజాసాబ్.. పెద్దపనే.. ఈ ఏడాది రిలీజ్ అవుతుందా?
X

డార్లింగ్ హీరో ప్రభాస్ హీరోగా, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా రాజాసాబ్. ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. దీంతో వాయిదా గ్యారెంటీ అనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా పాటలు షూట్ చేయాల్సి ఉందట. హీరోయిన్ల డేట్లు అడ్జెస్ట్ కాకపోవడంతోనే లేట్ అవుతుందని అంటున్నారు. మరోవైపు బడ్జెట్ ప్రాబ్లమ్ కూడా ఉందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. గతేడాది చాలా ఫ్లాప్స్ వల్ల నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కాస్త ఇబ్బందుల్లో ఉందనే టాక్ కూడా వస్తోంది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే 'రాజాసాబ్' ఫుటేజ్ మూడున్నర గంటలు వచ్చిందని, పాటలు కూడా కలిపితే మరో 15 నిమిషాలు పెరుగుతుంది. కాబట్టి లింక్స్ మిస్ కాకుండా వాటిని ఎడిట్ చేయాల్సి ఉంటుంది. అది చాలా పెద్ద పనే అని అంటున్నారు. ఇన్ని కష్టాలు పడుతున్న 'రాజాసాబ్'.. ఈ ఏడాది రిలీజ్ అవుతుందా? లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది.

Tags

Next Story