Rajasaheb : రాజాసాబ్.. 3నెలలు లేట్
డార్లింగ్ హీరో ప్రభాస్, 2018 మాళవిక మోహనన్, నిధి అగర్వా ల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కు తున్న సినిమా రాజాసాబ్. కల్కి తర్వాత ప్రభాస్ నటించిన హారర్ రొమాంటిక్ కామెడీ చిత్రం 'ది రాజా సాబ్'. ఏప్రిల్ 10న సినిమాను విడుదల చేయ సున్నట్టు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. చిత్ర బృందం స్వయంగా ఈ రిలీజ్ డేట్ ను ప్రకటించింది. అయితే ఇప్పుడీ సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని సమా చారం. పోస్ట్ ప్రొడక్షన్ మరింత సమయం అవ సరమైన ది రాజా సాబ్ సినిమా విడుద లను వాయిదా వేసే యోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ ఎక్కువగా ఉప యోగించారని సమాచారం. దీంతో తొందరపడి సినిమాను విడుదల చే యకూడదనే అభిప్రాయం మేకర్స్ లో ఉందని సమాచారం. దీంతో అనుకు న్న తేదీ కన్నా కనీసం మూడు నెలలు ఆలస్యంగా 'ది రాజా సాబ్' సినిమా రిలీజయ్యే అవకాశం ఉంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ది రాజా సాబ్' సినిమాలో ప్రభాస్ రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఆడియో వేడుకను జపాన్లో గ్రాండ్గా నిర్వహించేందుకు చిత్రబృందం ప్లాన్ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com