Coolie Movie : 'కూలీ' సినిమాకి రజినీకాంత్ భారీ రెమ్యునరేషన్

Coolie Movie : కూలీ సినిమాకి రజినీకాంత్ భారీ రెమ్యునరేషన్

ఏళ్లు గడుస్తున్నా సూపర్ స్టార్ రజినీకాంత్ మ్యాజిక్ మాత్రం తగ్గడం లేదు. జైలర్ తో వచ్చిన సక్సెస్ తో రజినీ క్రేజ్ కూడా భారీగా పెరిగిపోయింది. తన 171వ చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేస్తున్నారు రజినీ. ఇటీవలే ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేశారు బజ్ క్రియేట్ చేసారు మేకర్స్.

ఈ సినిమాకి ‘కూలీ’ అనే మాస్ టైటిల్ ని మేకర్స్ అనౌన్స్ చేసారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ మూవీ.. జూన్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టుకోనుంది. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రజిని గత చిత్రం ‘జైలర్’ని కూడా ఈ సంస్థే నిర్మించింది. నిర్మాత కలానిథి మారన్.. రజినీకాంత్ కి ఖరీదైన కారు, అలాగే రూ.210 కోట్ల భారీ రెమ్యూనరేషన్ ని అందించారు.

లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో చేయబోతున్న ఈ క్రేజ్ ప్రాజెక్ట్ కోసం కూడా రజినికి భారీ పారితోషకాన్ని అప్పజెప్పారట. రజినీకాంత్ అక్షరాలా రూ.260 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు లేటెస్ట్ టాక్. డైరెక్టర్ లోకేష్ కే రూ.60 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారని వినికిడి. ప్యాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, నాగార్జున లాంటి లాంగ్వేజ్ వైజ్ స్టార్స్ ను భాగం చేయనున్నారట.

Tags

Read MoreRead Less
Next Story