Rakul Preet Singh : ఈ సినిమా నాకు ఎంతో స్పెషల్ : రకుల్ ప్రీత్ సింగ్

హీరో కమల్ హాసన్ ( Kamal Haasan ), స్టార్ డైరెక్టర్ శంకర్ ( Director Shankar ) తెరకెక్కించిన సినిమా.. భారతీయుడు 2. ఈ సినిమాను ఉదయనిధి స్టాలిన్, సుభాస్కరన్.. భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఇది రూపొందింది. అప్పట్లో భారతీయుడు ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో తెలిసిందే. దీన్ని కూడా అదే తరహాలో తెరకెక్కిచింనట్లు సమాచారం. భారతీయుడు 2 లో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్ ప్రధాన పాత్రలు పోషించారు.
అలాగే ఎస్.జె.సూర్య, బాబయ్ సింహ, సముద్రఖని వంటి తదితరులు కూడా ఇందులో నటిస్తున్నరు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ మ్యూజిక్ అందించాడు. ఇక భారతీయుడు 2 జులై 12 న విడుదల కానుంది. రీసెంట్ ఆడియో లాంచ్ కూడా గ్రాండ్ గా జరిగింది. ఆ సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం మూవీ టీం ప్రమోషన్స్ లలో ఫుల్ బిజీ గా ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ ( Rakul Preet Singh ) కూడా ప్రమోషన్ లలో పాల్గొంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న రకుల్.. భారతీయుడు సినిమా తన కెరీర్ లోనే ఎంతో స్పెషల్ మూవీ అని తెలిపింది. ఇందులో తన పాత్ర ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. డైరెక్టర్ శంకర్ సినిమాలో నటించడం ఎంతో ఆనందంగా ఉందని వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com