Rakul Preet Singh : టాలీవుడ్ లోకి రకుల్ రీ ఎంట్రీ!

Rakul Preet Singh : టాలీవుడ్ లోకి రకుల్ రీ ఎంట్రీ!
X

నాలుగేళ్లుగా బాలీవుడ్ ను అంటిపెట్టుకునే ఉంటున్న నటీమణి రకుల్ ప్రీత్ సింగ్ ( Rakul Preet Singh ). తనకు అవకాశాలు రాకపోవడంతో సౌత్ ఇండస్ట్రీపై విమర్శలు గుప్పించిందీ బ్యూటీ. తన లాంటి ప్రతిభావంతులకు పాన్ఇండియా సినిమాల్లో అవకాశాలు ఇవ్వడం లేదనే అంశాన్ని లేవనెత్తింది. ఇదిలా ఉండగా.. పాన్ ఇండియా మూవీగా శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఇండియన్-2 లో రకుల్ నటించింది.తాజాగా తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో 'ఆస్క్ మి ఎనీథింగ్' సెషన్ ను హోస్ట్ చేసింది. అభిమానుల నుంచి మళ్లీ తెలుగు సినిమాలు చేయరా? అన్న ప్రశ్న వచ్చింది. 'నా తెలుగు అభిమానులందరినీ నిజంగా మిస్ అవుతున్నాను. త్వరలో తెలుగు సినిమా చేయాలనుకుంటున్నాను. సరైన స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నా. నేను తెలుగు మాట్లాడగలను. కానీ హిందీ కొచ్చిన తర్వాత ఆ భాష మిస్ అవుతున్నాననే బాధ నాలో ఉంది. త్వరలోనే తెలుగు సినిమా అవకాశం వస్తుందని ఆశిస్తున్నా' అని అంది. రకుల్ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గామారాయి. చాన్స్ వస్తే తెలుగులో యాక్ట్ చేస్తానని చెప్పింది. ఎవరు అవకాశం ఇస్తారో.. తన నెక్స్ట్ సినిమా ఏంటో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే!

Tags

Next Story