సడెన్‌గా రకుల్ పెళ్లి.. ఎందుకో తెలుసా.. ఇంట్రెస్టింగ్ హిస్టరీ

సడెన్‌గా రకుల్ పెళ్లి.. ఎందుకో తెలుసా.. ఇంట్రెస్టింగ్ హిస్టరీ

చూస్తూ ఉండిపోవాలనిపించే వెండితెర ఫిగర్లలో రకుల్ ప్రీత్ సింగ్ (Rakul preet singh) ఒకరు. రకుల్ ప్రీత్ తాజాగా వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. బాలీవుడ్ నిర్మాత నటుడు జాకీభగ్నానితో గోవాలో రిసార్టులో ఘనంగా పెళ్లి వేడుకలు జరుపుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా హాజరై సందడి చేశారు. రకుల్ భగ్నాని జంట గత మూడేళ్లుగా ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఇక ప్రేమ చాలు పెళ్లిబంధంలోకి అడుగు పెడదామని జాకీ అన్నాడట. అందుకే పెళ్లి చేసుకున్నారట. ఈ కొత్తజంటను పలువురు సెలబ్రిటీస్, అలాగే అభిమానులు సోషల్ మీడియా వేదికగా విష్ చేస్తున్నారు.

కన్నడ సినిమా గిల్లితో ఎంట్రీ ఇచ్చిన రకుల్.. దశాబ్ద కాలంగా ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మొదట హిట్ అందుకున్న రకుల్.. తర్వాత టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. సౌత్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. గత కొంతకాలంగా టాలీవుడ్ లో అవకాశాలు దక్కడంతో బాలీవుడ్ కి వెళ్ళి సిట్టిల్ అయ్యింది. ఒక్క ఏడాదిలోనే ఐదు సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ ఐదు సినిమాలు 2022లో రిలీజ్ అయ్యాయి. సౌత్ లోనూ తనదైన నటనతో మెప్పించిన రకుల్ కోట్లాదిమంది ప్రేక్షకులకు చేరువయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story