Shriya : షూటింగ్ మధ్యలోనే పారిపోయా : శ్రియా

గత ఇరవై ఏళ్లుగా సినీ రంగంలో రాణిస్తోంది శ్రియా (Shriya). అన్నీ భాషల్లో నటిస్తూ ఎన్నో హిట్లను అందుకుంది. అటు బాలీవుడ్ లోనూ ఇటు సౌత్ లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా తన సినీ కెరీర్ గురించి శ్రియా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కొత్తలో ఎన్నో సవాళ్లు ఎదుర్కున్నానని చెప్పుకొచ్చింది. ఒకసారి భయపడి ఏకంగా షూటింగ్ సెట్ నుంచే పారిపోయినట్లు వెల్లడించింది.
విక్రమ్ తో కందస్వామి సినిమా చేస్తోన్న సమయంలో ఒక్క షాట్ కి ఎన్నో టేక్ లు తీసుకున్నానని తెలిపింది. ఆ సమయలో విక్రమ్ ఎంతో ఓపికగా తనను భరించాడని చెప్పుకొచ్చింది. ఆ క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేనని వ్యాఖ్యానించింది. అలా చేస్తే నిర్మాతకు ఎంత భారం కలుగుతుందో విక్రమ్ తనకు చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయని శ్రియా పేర్కొంది.
శివాజీ సినిమా చేస్తున్న సమయంలో రజనీకాంత్ కుడా ఓ సలహా ఇచ్చాడని వెల్లడించింది. అందం.. అభినయంతో సినిమాలు చేస్తున్నావు. భవిష్యత్ లో పరిస్థితులు మారొచ్చు. వైఫల్యాలు రావచ్చు. అయినా ప్రేక్షకులతో మర్యాదగా ప్రవర్తించాలి అన్న రజినీ మాటలను ఆమె గుర్తుకు తెచ్చుకుంది. ఈ మాటలు తననెంతో మార్చినట్లు వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com