Ramayanam : రామాయణం కోసం రూ.75 కోట్ల రెమ్యునరేషన్!

నితేశ్ తివారీ తెరకెక్కించనున్న ‘రామాయణం’ సినిమాలో రాముడి పాత్ర కోసం రణ్‌బీర్ కపూర్ రూ.75 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. మూడు భాగాలుగా వస్తున్న ఈ సినిమా కోసం రణ్‌బీర్ ఏకంగా 225 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నారట. ఇప్పుడు ఇదే ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఇక సీత పాత్రలో నటించనున్న హీరోయిన్ సాయి పల్లవి రూ.6 కోట్లు తీసుకోనుండగా రాకింగ్ స్టార్ యశ్ ఏకంగా రూ.80 కోట్ల పారితోషికం తీసుకోనున్నట్లు సమాచారం. తాజాగా, రాముడి పాత్ర కోసం రణ్‌బీర్ శిక్షణ తీసుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది. ఇక అలాగే కన్నడ హీరో యష్ రావణుడిగా.. ఆంజనేయుడి పాత్రలో సన్నీ డియోల్, శూర్ఫణఖగా రకుల్ కనిపించనుందని టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై ఇప్పటివరకు ప్రకటన రాలేదు.
దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారని సమాచారం. 11 కోట్లతో అయోధ్యను రీక్రియేట్ చేయనున్నారు. ప్యాలెస్ నుంచి వీధుల వరకు నగరం మొత్తం మీద మేకర్స్ ప్రత్యేక దృష్టి పెట్టారు. అత్యాధునిక విజువల్ ఎఫెక్టులతో ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారని.. ఇందులో అయోధ్య వైభవం.. యుద్ధాలు.. ఆధ్యాత్మిక అంశాలను వెండితెరపై చూపించనున్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com