Rani Mukerji : ఈ వయసులో ఇక బిడ్డను కనలేను.. రాణీ ముఖర్జీ ఎమోషనల్

ఇకపై తాను బిడ్డను కనలేనని బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ (Rani Mukerji) అన్నారు. నాకు కూతురు పుట్టిన తర్వాత ఏడేళ్లు ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించా. నాలుగేళ్ల క్రితం గర్భం దాల్చాను. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. కడుపులోనే బిడ్డను కోల్పోయా. ఆ నరకం అనుభవించినవారికే తెలుస్తుంది. నేను పైకి కనిపించేంత యంగ్ కాదు.
ప్రస్తుతం నా వయసు 46 ఏళ్లు. ఈ వయసులో ఇక బిడ్డను కనలేను. నా కూతురికి చెల్లినో, తమ్ముడినో ఇవ్వలేకపోయాననే బాధ మెలిపెడుతోంది’ అని ఆమె పేర్కొన్నారు. అయినా ఉన్నదాంట్లోనే సంతోషం వెతుక్కోవాలి. అధీరా (రాణి కూతురు) నా బంగారు తల్లి. తన వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. బిడ్డను కనే వయసు దాటేశాను. కాబట్టి నాకు అధీరా ఒక్కరు చాలు అని చెప్పుకొచ్చింది.
కాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్లలో ఒకరు రాణి ముఖర్జీ. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోస్ సరసన నటించి మెప్పించింది. హలో బ్రదర్, హర్ దిల్ జో ప్యార్ కరేగా, ప్యార్ దీవానా హోతా హై, చలో ఇష్క్ లడాయే, చోరీ చోరీ, ఎల్‌వోసీ: కార్గిల్, మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే వంటి హిట్ చిత్రాల్లో నటించింది.పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే తిరిగి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com