Ranveer Singh : రణ్‌వీర్ ఇన్స్టా ఖాతాలో పెళ్లి పిక్స్ డిలీట్

బాలీవుడ్ కపుల్ రణ్‌వీర్, దీపికా పదుకుణేపై మరోసారి విడాకుల రూమర్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వీరి పెళ్లి ఫొటోలను తన ఇన్‌స్టా ఖాతా నుంచి రణ్‌వీర్ డిలీట్ చేయడమే ఇందుకు కారణం . దీపికా ఇన్‌స్టాలో ఫొటోలు అలాగే ఉన్నాయి. దీనిపై రణ్‌వీర్ స్పందిస్తే కానీ ఈ రూమర్స్‌కు చెక్ పడదు. గతేడాది ఓ షోలో దీపికా కామెంట్స్ తర్వాత వీరు విడాకులు తీసుకుంటారనే ప్రచారం జోరుగా సాగింది.
రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే మధ్య వాగ్వాదం జరిగిందని, అందుకే రణవీర్ సింగ్ పెళ్లి ఫోటోలను తొలగించాడని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే దీపిక ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. ఇలాంటి టైంలో విడాకులు అనేది నమ్మేలా అనిపించట్లేదని మరికొందరు తమ అభిప్రాయం వెల్లడిస్తున్నారు. కాగా ఈ జంట 2018లో వివాహం చేసుకుంది. రణవీర్ సింగ్ , దీపికా పదుకొణె త్వరలోనే అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందనున్నారు. దీపిక త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది.
హీరోహీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది ఎప్పటినుంచో ఉన్నదే. అయితే వీళ్లలో కొందరు కలిసి ఉంటుంటే.. మరికొందరు మాత్రం మనస్పర్థలు కారణంగా విడాకులు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి బాలీవుడ్ కపుల్ రణ్‌వీర్ - దీపిక చేరబోతున్నారా అనే సందేహం వస్తోంది. చూడాలి మరి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com