Rashmika Mandanna : విజయ్ తో సినిమా చేస్తు్న్నా : రష్మిక మందన్నా

Rashmika Mandanna : విజయ్ తో సినిమా చేస్తు్న్నా :  రష్మిక మందన్నా
X

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రష్మిక మందన్నా (Rashmika Mandanna) తొలి కాంబినేషన్ 'గీత గోవిందం' సంచలన విజయం సాధించింది. ఈ జంట స్క్రీన్ పై మ్యాజిక్ చేసిందని అభిమానులు ఆనందించారు. ఆ తర్వాత వీరిద్దరు కలిసి 'డియర్ కామ్రేడ్ 'లో నటించారు. ఆ తర్వాత వీరి కాంబినేషన్ కు గ్యాప్ వచ్చింది. రష్మిక బాలీవుడ్ లో 'యానిమల్' చిత్రంలో నటించింది. ఇంకా పుష్ప, ఇప్పుడు. పుష్ప 2లో నటిస్తోంది.. ఈ సినిమా సక్సెస్ తో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది.

విజయ్ దేవరకొండ 'లైగర్, ఖుషీ' చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్నారు. ఇకపోతే మరోసారి విజయ్, రష్మిక జంటను తెరపై చూడాలని కోరుకుంటున్న అభిమానుల కోరిక త్వరలో తీరనుంది. త్వరలోనే వీరిద్దురు కలిసి

నటించనున్నట్టు తెలిసింది. ఇటీవలే ఓ విదేశీ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు జపాన్ వెళ్లిన రష్మిక అక్కడే అభిమానులతో ఈ విషయం పంచుకుంది.

విజయ్ దేవరకొండతో సినిమా చేయనున్నట్టు వెల్లడించింది. రష్మిక ప్రస్తుతం పుష్ప 2, ది గర్ల్ ఫ్రెండ్ (రాహుల్ రవీంద్రన్ దర్శకుడు చిత్రాలతో పాటు శేఖర్ కమ్ముల చిత్రంలో నటిస్తోంది.

Tags

Next Story