Rashmika Mandanna : రష్మిక ఇంటరెస్టింగ్ కొటేషన్

పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్న బ్యూటీ రష్మిక మందన. ప్రస్తుతం పుష్ప ది రూల్ మూవీలో ఆమె పోర్షన్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ సినిమా డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గతేడాది యానిమల్ సినిమాతో బాలీవుడ్ లో రష్మిక మందన సూపర్ సక్సెస్ అందుకుంది. ఇవి కాకుండా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఫీమేల్ సెంట్రిక్ మూవీ కూడా రష్మిక మందన చేస్తోంది. ఈ సినిమా తర్వాత రష్మిక ఇమేజ్ మరింత పెరిగిపోతుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ బ్యూటీ 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ ఎల్లో కలర్ ట్రెడిషనల్ అవుట్ ఫిట్తో ఫొటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసంది. ఈ ఫోటోలని ఏకంగా 9.78లక్షల మంది లైక్ చేశారు. ఈ పిక్స్లో రష్మిక చాలా క్యూట్గా అచ్చ తెలుగు అందంలా మెరిసిపోతోందంటున్నారు అభిమానులు. వీటికి ఆమె ఇంటరెస్టింగ్ కొటేషన్ కూడా ఇచ్చింది. "నేను ఎల్లో కలర్ని ఎక్కువగా ఇష్టపడటానికి కారణం ఏంటో తెలుసా..? ఇది సన్ లైట్ ని, పూల అందాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని మనలో రిఫ్లెక్ట్ అయ్యేలా చేస్తుంది' అని పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com