Rashmika Mandanna : డేట్లు ఖాళీ లేవంటున్న రష్మిక

కన్నడ సోయగం రష్మిక మందన్న తారాపథంలో దూసుకుపోతున్నది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుసగా భారీ సినిమాలతో బిజీబిజీగా మారింది. మరో ఏడాది పాటు ఈ అమ్మడి డేట్స్ ఖాళీ లేవు అంటున్నారు. ప్రస్తుతం రష్మిక చేతిలో ఆరు సినిమాలున్నాయి.
వీటి షూటింగ్స్ మొత్తం పూర్తి కావడానికి ఏడాదికి పైగా సమయం పడుతుందంటున్నారు. దాంతో ఈ భామ డేట్స్ కావాలంటే మరో ఏడాది పాటు ఆగాల్సిందే. ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగులో పప్పు-2, రెయిన్బో, గర్ల్ ఫ్రెండ్, కుబేర చిత్రాల్లో నటిస్తున్నది. 'పుష్ప - 2' చిత్రీకరణ తుదిదశకు చేరుకోగా.. మిగిలిన మూడు చిత్రాలు షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. ఇక బాలీవుడ్లో 'యానిమల్' బ్లాక్ బస్టర్ విజయంతో ఈ సొగసరికి అవకాశాలు వెల్లువెత్తున్నాయి.
'సికిందర్' సినిమాలో సల్మాన్ ఖాన్తో జోడీ కట్టబోతున్నది. విక్కీకౌశల్తో 'ధావా' సినిమాలో నటిస్తున్నది. హిందీలో మరికొన్ని ఆఫరొచ్చినా.. డేట్స్ ఖాళీలేని కారణంగా రష్మిక అంగీకరించలేదని అంటున్నారు. మొత్తంగా చూస్తే మరో ఏడాది పాటు రష్మిక మందన్న రేట్స్ దొరకడం కష్టమేనని ఫిల్మ్ సర్కిల్స్ వినిపిస్తున్నది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com