Rashmika Mandanna : అటల్ సేతుపై రష్మిక వీడియో.. ప్రధాని మోడీ రియాక్షన్

అరేబియా సముద్రం నరేంద్రమోడీ ప్రభుత్వం ముంబైలో నిర్మించిన అత్యంత పొడవైన వంతెన 'అటల్ సేతు'. దీనిని 2024 జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అటల్ సేతు బ్రిడ్జి ప్రమోషన్ చేస్తూ రష్మిక ఓ వీడియోను షేర్ చేసుకున్నారు. అటల్ సేతు బ్రిడ్జిపై తెగ ప్రశంసలు కురిపించారు.
ముంబై, నవీ ముంబైని కలుపుతూ 22 కిలోమీటర్ల మేర అటల్ సేతు వంతెనను నిర్మించింది కేంద్ర ప్రభుత్వం. గతంలో ఈ బ్రిడ్జి నిర్మాణం లేకముందు ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణానికి 2 గంటల సమయం పట్టేది. కానీ.. వంతెనను అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత కేవలం 20 నిమిషాల్లో ముంబై, నవీ ముంబై మధ్య ప్రయాణం సాగుతోందని రష్మిక తన వీడియోలో పేర్కొన్నారు.
ఇలాంటి అద్భుతం భారత్‌లో నిర్మించడం సంతోషమన్నారు రష్మిక. భారత్ అభివృద్ధిలో ముందుంది అని తెలిపారు. ఈ వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ తన ఎక్స్ ఖాతాలో రీట్వీట్ చేశారు. ప్రజల జీవితాలను మెరుగుపర్చడం.. వారి జీవితాలను అనుసంధానం చేయడం కంటే ఆనందం ఏముంటుందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com