Eagle OTT : రవితేజ డబుల్ ధమాకా.. రెండు ఓటీటీల్లో ఈగల్ మూవీ

రీసెంట్ గా విడుదలై మంచి వసూళ్లు రాబట్టింది మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) నటించిన సినిమా 'ఈగల్' (Eagle). ఈ మూవీకి సినిమాటో గ్రఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 9వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఐనా మంచి కలెక్షన్లే వచ్చాయి. అందుకే.. మూవీకి ఓటీటీ డిమాండ్ పెరిగింది.
థియేటర్లో మిస్ అయిన వారికి మేకర్స్ గుడ్‌న్యూస్ చెప్పారు. రవితేజ ఈగల్ మూవీని రెండు ఓటీటీల్లో రిలీజ్ చేశారు. ఈటీవీ విన్, ప్రైమ్ వీడియోల్లో ఈగల్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. హిందీలో సబ్ టైటిల్‌తో థియేటర్లలో విడులైంది. కానీ..ప్రస్తుతానికి హిందీ వెర్షన్ ఓటీటీలో విడుదల కాలేదు. రవితేజ ఈగల్ హిందీ వెర్షన్ కు కూడా ఓటీటీలో భారీ డిమాండ్ ఉంది.
ఈగల్ మూవీలో రవితేజ సరసన హీరోయిన్‌గా కావ్య థాపర్ నటించింది. అనుపమ పరమేశ్వర్ కీలక పాత్రలో మెరిసింది. నవదీప్, అవసరాల శ్రీనివాస్, మధుబాల వంటి నటులు కూడా ఈ సినిమాలో ముఖ్యపాత్రల్లో కనిపించారు. ఈగల్ కు సీక్వెల్ గా యుద్ధకాండ మూవీ త్వరలోనే వస్తుందని మేకర్స్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com