Kick : రవితేజ కిక్ రీ రిలీజ్.. ఎప్పుడంటే?

Ravi Teja రవితేజ సూపర్ హిట్ సినిమాల్లో కిక్ (Kick) ఒకటి. ఈ మూవీ మరోసారి థియేటర్ లోకి రానుంది. అంటే రీ రిలీజ్ అన్నమాట. ఇప్పుడంతా రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది కాబట్టి ఈ కామెడీ యాక్షన్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రిలీజ్ చేస్తోంది. 2009లో రిలీజైన ఈ మూవీ.. మార్చి 1న థియేటర్లలో రీ రిలీజ్ కాబోతోంది. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ వెల్లడించింది. .
రవితేజ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘కిక్’ మూవీలో ఇలియానా హీరోయిన్ గా నటించింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ డిఫరెంట్ కాన్సెప్టుతో తెరకెక్కి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కోలీవుడ్ నటుడు శామ్ కీలక పాత్ర పోషించాడు. తమన్ పాటలు మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకున్నాయి. రవితేజ, బ్రహ్మానందం ట్రాక్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది
హీరోగా రవితేజకు, దర్శకుడిగా సురేందర్‌రెడ్డికి కిక్ మూవీ స్టార్‌డమ్‌ను తీసుకొచ్చింది. కిక్ మూవీని హిందీలో సల్మాన్ ఖాన్ రీమేక్ చేశాడు. తమిళం, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా రీమేకైంది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా కిక్ 2 కూడా వచ్చింది. కానీ అది కాస్త బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కాగా రవితేజ నటించిన ‘ఈగల్’ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోన్న సంగతి తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com