Mister Idiot : రవితేజ వారసుడు మాధవ్ హీరోగా.. మిస్టర్ ఇడియట్

మాస్ మహరాజ్ రవితేజ వారసుడు మాధవ్ హీరోగా నటిస్తోన్న సినిమా 'మిస్టర్ ఇడియట్'. ఈ చిత్రంలో సిమ్రాన్ శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జెజే ఆర్ రవిచంద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
'పెళ్లి సందడి' చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న గౌరీ రోణంకి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా శుక్రవారం 'మిస్టర్ ఇడియట్' చిత్రం టీజర్ ను రవితేజ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.
ఈ టీజర్ ను చూస్తే.. ధృవ ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజీలో చదివే సత్య (హీరోయిన్ సిమ్రాన్ శర్మ) కాలేజ్ టాపర్. ఆమె డిజైన్ గీస్తే ది బెస్ట్ నిలవాల్సిందే. కాలేజ్లో సత్య మెరిట్న బీట్ చేయడం ఎవరి వల్లా కాదు. అలాంటి టైమ్లో కాలేజ్లో అడుగు పెడతాడు హీరో (మాధవ్), సత్యను సరదాగా టీజ్ చేస్తుంటాడు. అల్లరిగా సాగే వీరి స్నేహం ప్రేమగా ఎలా మారింది? అనేది టీజర్ లో ఇంట్రెస్టింగ్ గా చూపించారు. మాధవ్ రవితేజల్లా ఎనర్జిటిక్ గా కనిపించాడు. స్టైలిష్ లుక్స్ పాటు పర్ ఫార్మెన్స్ లోనూ ఆకట్టుకున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com