Rashi Singh : నచ్చితే గ్లామరస్ పాత్రలకు నేను రెడీ : రాశి సింగ్

గ్లామరస్ పాత్రలకు తాను రెడీనని అంటుంది హీరోయిన్ రాశి సింగ్ (Rashi Singh). తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సినిమాల్లోకి రాకముందు ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం చేశాను. అయితే చిన్నతనం నుండి సినిమాలు అంటే ఇష్టం. హీరోయిన్ కావాలని కోరిక ఉండేది. నా తొలి అవకాశం సంతోష్ శోభన్ తో 'ప్రేమ్ కుమార్' చిత్రం చేశాను. ఆహాలో 'పాపం పసివాడు'లో నటించాను" అని చెప్పింది నటి రాశి సింగ్.
శివ కందుకూరు నటిస్తున్న 'భూతద్దం భాస్కర్ నారాయణ' చిత్రంలో రాశి నాయికలో నటిస్తోంది. తెలుగు అవకాశాలు వస్తుందడంతో హైదరాబాద్లోనే నివాసం ఏర్పరచుకున్నట్టు తెలిపింది. భూతద్దం భాస్కర్ నారాయణ మార్చి ఒకటవ తేదీన ప్రేక్షకులు ముందుకువస్తోంది. ఈ సినిమాలో నాది బలమైన పాత్ర పేరు లక్ష్మి. కథ విన్నప్పుడు షాకింగ్ అనిపిం చింది. రిపోర్టర్ గా కనిపిస్తాను. సక్సెస్స్ థ్రిల్ రోమాన్స్ ఉన్న చిత్రమిది. క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది.
శివకందుకూరితో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. వినయం, ఓపిక ఉన్న నటుడు. ఆయన సినిమా కోసం కష్టపడ్డారు. ఈ చిత్రం తప్పకుండా మంచి విజయాన్నిస్తుందనే నమ్మకముంది. దర్శకుడు పురు షోత్తం రాజ్ క్లారిటీ ఉన్న దర్శకుడు. ఆయ న విజయ్ చాలా స్పష్టం గా ఉంది. సినిమా అద్భుతంగా తీశారు. నిర్మాతలు యువకులు కావడం, సినిమాపై వారికి ప్యాషన్ ఉండ టంతో మంచి సపోర్ట్ ఇచ్చారు. రాజీ పడ కుండా ఖర్చు చేసి నిర్మించారు. భవిష్యత్తులో వైవిధ్యమైన పాత్రలు చేయాలని ఉంది. మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ చేయాలని ఉంది. నచ్చితే గ్లామరస్ పాత్రలు చేయడానికి సిద్దమే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com