Ready for Marriage : పెళ్లికి నేను రెడీ అంటున్న రెజీనా

Ready for Marriage : పెళ్లికి నేను  రెడీ అంటున్న రెజీనా

గ్లామర్ హీరోయిన్ గా కుర్రాళ్ల మనసులు దోచుకున్న హీరోయిన్ రెజీనా (Regina) పెళ్లికి రెడీ అంటుంది.. రెజీనా త్వరలో ఓ బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకోబోతు న్నట్లు టాక్.. ఇరు కుటుంబ సభ్యులు ఒకే చెప్పడంతో రెజీనా ఆ బిజినెస్ మ్యాన్ తో తన భర్తగా పొందబోతున్నట్లు కోలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలో ఈ శుభవార్తను స్వయంగా రెజీనా ప్రకటించే అవకాశం ఉందని టాక్‌..

పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాలతో రెజీనా క్రేజ్ తెచ్చుకుంది. అడవి శేష్ హీరోగా తెరకెక్కిన ఎవరు చిత్రంలో రెజీనా నెగిటివ్ షేడ్స్ లో అదరగొట్టింది. అంతకు ముందు గ్లామర్ రోల్స్ చ్చేసిన రెజీనా ఈ చిత్రంలో కథకు తగ్గట్లుగా బోల్డ్ గా నటించింది. ఇక చివరగా రెజీనా శాకినీ డాకిని అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో మరో లీడ్ రోల్ లో నివేత థామస్ నటించడం విశేషం.

అయితే ఈ చిత్రం ఆక ట్టుకోలేకపోయింది. గ్లామర్ రోల్స్ దొరికితే అందాలు ఆరబోయడానికి రెజీనా వెనకడుగు వేయదు. అలాగని ఆమె కేవలం గ్లామర్ రోల్స్ కోసమే ఎదురుచూడడం లేదు. వైవిధ్యం ఉన్న పాత్రలని కూడా ఎంచుకుం టోంది.

Tags

Read MoreRead Less
Next Story