Kovai Sarala : అందుకే పెళ్లి చేసుకోలేదు: కోవై సరళ

Kovai Sarala : అందుకే పెళ్లి చేసుకోలేదు: కోవై సరళ
X

తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో అనేక వైవిధ్యమైన పాత్రల్ని చేశారు కోవై సరళ. తాను పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడం వెనుక కారణాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘పెళ్లి చేసుకోవాలన్న రూలేం లేదు కదా. స్వేచ్ఛగా ఉండాలనే చేసుకోలేదు. మరీ బోర్ కొడితే హిమాచల్ ప్రదేశ్, షిరిడీ లాంటి ప్రాంతాలకు వెళ్తుంటాను. ఒంటరిగా భూమ్మీదకు వచ్చాం. ఆ తర్వాతేగా బంధాలు ఏర్పడ్డాయి. ఒకరిమీద ఆధారపడి బతకాలని నేను అనుకోను. ఎంతోమంది పిల్లలు ఉన్న వాళ్లు కూడా చివరి రోజుల్లో ఒంటరి జీవితాన్ని గడుపుతుంటారు. మనల్ని ఒకరు చూడాలని ఎప్పుడూ అనుకోకూడదు. ధైర్యంగా ముందుకువెళ్లాలి‘ అని ఆమె పేర్కొన్నారు.

వందల సినిమాల్లో తన హాస్యంతో నటించి కడుపుబ్బా నవ్వించిన కోవై సరళ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. చిన్న హీరో మొదలుకుని పెద్ద హీరోలందరితో పని చేసిన సరళ అంటే సినిమా పరిశ్రమలో అందరికీ ఎంతో అభిమానం. సినిమాల్లో నవ్వులు పూయించినా నిజ జీవితంలో మాత్రం ఆమెకు కలిసి రాలేదు. ఆమె పెళ్లి చేసుకోకుండా ఆజన్మ బ్రహ్మాచారిణిగా ఉండిపోయింది.

పరిశ్రమకు వచ్చి 35 ఏళ్లు అవుతోందని టాలీవుడ్‌ మెట్టినిల్లు, కోలివుడ్‌ పుట్టినిల్లుగా పేర్కొన్నారు. బ్రహ్మానందంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. చాలా సినిమాల్లో బ్రహ్మానందం తనకు భర్తగా నటించినా.. ఆయన తనకు అన్న లాంటివాడని వివరణ ఇచ్చారు. తండ్రిలాగా సలహాలు ఇస్తారని తెలిపారు.

Tags

Next Story