Mamta Mohandas : రిలేషన్ ఉండాలి కానీ అందులో ప్రెజర్ ఉండకూడదు : మమతా మోహన్ దాస్

జీవితంలో కచ్చితంగా ఒక తోడు ఉండాలని భావించడం లేదని నటి మమతా మోహన్ దాస్ ( Mamta Mohandas ) అన్నారు. ఓ ఇంటర్వ్యూలో రిలేషన్‌షిప్‌పై తన అభిప్రాయాలను వెల్లడించారు. ‘లాస్ ఏంజెలెస్‌లో ఉన్నప్పుడు ఓ వ్యక్తిని ప్రేమించా. కానీ మా బంధం ఎక్కువ కాలం నిలబడలేదు. రిలేషన్ ఉండాలి కానీ అందులో ప్రెజర్ ఉండకూడదు. భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేం. ప్రస్తుతం మంచి భాగస్వామి కోసం వెతుకుతున్నా. సమయం వచ్చినప్పుడు అన్ని బయటకొస్తాయి’ అని చెప్పారు.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘యమదొంగ’లో ప్రత్యేక పాత్రతో గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ మమతా మోహన్‌దాస్. ఆ సినిమా తర్వాత ఈ మలయాళీ కుట్టి వరుస అవకాశాలు అందుకొని దక్షిణాది భాషలన్నిటిలో నటించారు. ప్రస్తుతం విజయ్ సేతుపతితో కలిసి ‘మహారాజా’తో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. గతేడాది ఐదు చిత్రాలతో సందడి చేసిన మమతా ప్రస్తుతం ‘మహారాజా’ ప్రచారంలో బిజీగా ఉన్నారు. 2011లో మమతా మోహన్ దాస్ ప్రజిత్ పద్మనాభన్ ను వివాహం చేసుకుంది. అయితే ఏడాదిలోపే వారిద్దరూ విడాకులు తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com