Manjummel Boys : 'మంజుమ్మల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్?

Manjummel Boys : మంజుమ్మల్ బాయ్స్ OTT రిలీజ్ డేట్ ఫిక్స్?

సినిమా హిట్టయిందని తెలియగానే.. ఓటీటీలో ఎప్పుడు అనేది చాలామంది మూవీ లవర్స్ అడిగే ప్రశ్న. అందుకే ఈ వార్త. యూత్ ఫుల్ సినిమాలకు ఓటీటీలో గిరాకీ ఎక్కువ. అందునా మలయాళ యూత్, క్రైమ్ థ్రిల్లర్లకు తెలుగులో ఉన్న డిమాండ్ మామూలుగా ఉండదు. అందుకే.. ఈ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని మలయాళ సినిమాలను డబ్ చేసి ఓటీటీలో లాభాలు ఆర్జిస్తుంటారు మేకర్స్.

అలాగే.. రీసెంట్ గా కేరళలో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది మంజుమ్మల్ బాయ్స్ మూవీ. ఈ మలయాళ బ్లాక్ బస్టర్ ఇపుడు OTT రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ+ హాట్‌స్టార్ లో వచ్చే నెల 3 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఓ గుహలో చిక్కుకున్న స్నేహితుడిని కాపాడేందుకు మిత్రులు చేసే పోరాటమే ఈ చిత్రం ప్రధాన కథ. మంచి రివ్యూలు కూడా వచ్చాయి. దర్శకుడు చిదంబరం ఈ మూవీని డైరెక్ట్ చేసిన విధానం హైలైట్. సుశీన్ శ్యామ్ మ్యూజిక్ సూపర్. మీ ఇంట్లో రిలాక్స్ గా మూవీని చూసేందుకు జస్ట్ వెయిట్ అండ్ సీ.

Tags

Read MoreRead Less
Next Story