Ranbir's Ramayana Release Year : 2027లో రామాయణం రిలీజ్!

రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతాదేవిగా నటిస్టున్న సినిమా రామాయణం. నితీశ్ తివారీ నిర్మిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే బిగ్ టాక్ మొదలైంది. రాకింగ్ స్టార్ యష్ లంకేశ్ రావణుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని వీలైనన్ని ఎక్కువ భాషలలో తెరకెక్కించేందుకు ప్లాన్ జరుగుతోంది. విజువల్ వండర్ గా రామాయణం చిత్రాన్ని ఆవిష్కరించాలని అనుకుంటున్నారు. దానికోసం నితీశ్ తివారీ టీమ్ ఎప్పటి నుంచో కసరత్తు మొదలుపెట్టింది.
ఇదిలా ఉంటే ఈ సినిమా 2027లో రిలీజ్ కానుందంట. అంటే మూడేళ్ల పాటు ఈ మూవీ షూటింగ్ జరగబోతోందని తెలుస్తోంది. రామాయణం కథతో ఇండియన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి ఉంటారు. అందుకే స్టోరీ నేరేషన్ లో ఎలాంటి వివాదాలకు తావివ్వలేకుండా అద్భుతమైన దృశ్యకావ్యంగా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.
మూడేళ్ల పాటు ఈ సినిమాని తెరకెక్కిస్తే ఆటోమేటిక్ గా మూవీపై అంచనాలు పెరుగుతాయి. అలాగే అప్పటికి సినిమా మార్కెట్ కూడా భారీగా విస్తరిస్తుంది. వరల్డ్ వైడ్గా ఇండియన్ సినిమాకి డోర్స్ ఓపెన్ అవుతాయి. మన కథలని చూడటానికి ఇతర దేశాల వారు ఆసక్తి చూపించే అవకాశం ఉంటుంది. ఆ స్కోప్ ని ఈ మూడేండ్లలో రాబోయే ఇండియన్ సినిమాలు క్రియేట్ చేయనున్నాయి. దీంతో రామాయణం సినిమాకి భారీ కలెక్షన్స్ వచ్చే చాన్స్ ఉందన్న చర్చ కూడా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com