Sayaji Shinde : ఛాతీలో తీవ్రమైన నొప్పి.. ఆసుపత్రిలో చేరిన షాయాజీ షిండే

విలక్షణ నటుడు షాయాజీ షిండే ఆసుపత్రిపాలయ్యారు. ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు గుండెకు రక్తం సరఫరా చేసే నాళాల్లో బ్లాక్స్ ఉన్నట్లు గుర్తించి, యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం షిండే పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే ఆయనను డిశ్చార్జ్ చేయనున్నారు. గతంలోనూ ఒకసారి షిండే ఛాతీనొప్పికి గురయ్యారు.
కొద్ది రోజుల క్రితం ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. సాధారణంగా గుండెపోటు వచ్చినప్పుడు.. గుండెను రక్తం సరాఫరా చేసే ధమనులు బ్లాక్ అయితే వాటిని ఓపెన్ చేయడానికి యాంజియోప్లాస్టీ చేస్తారు. అంటే గుండె ధమని బ్లాక్ కావడం కారణంగా రక్తప్రసరణ సరిగా జరగదు. అలాంటి సమయంలో గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. గుండెలో బ్లాక్ అయిన వెయిన్ ఓపెన్ చేసేందుకు యాంజియోప్లాస్టీ చేస్తారు.
కాగా చాలాకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్నారు సాయాజీ షిండే . సాయాజి షిండే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, భోజ్‌పురి, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేశాడు. తెలుగులో.. గుడుంబా శంకర్, ఆంధ్రుడు, అతడు, పోకిరి, లక్ష్మి, ఆట, దుబాయ్ శీను, ఆర్య 2, అరుంధతి, మిస్టర్ పర్ఫెక్ట్, దూకుడు, బిజినెస్‌మెన్.. ఇలా అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com