Director M.T. Vasudevan : ప్రముఖ రచయిత, డైరెక్టర్ వాసుదేవన్ కన్నుమూత

ప్రముఖ మలయాళ రచయిత, డైరెక్టర్ ఎంటీ వాసుదేవన్ నాయర్(91) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణం పట్ల కేరళ CM విజయన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇవాళ, రేపు సంతాప దినాలుగా ప్రకటించారు. మలయాళ సాహిత్యంలో ఆయన కృషికిగాను 1995లో కేంద్రం జ్ఞానపీఠ అవార్డును బహూకరించింది. పలుచిత్రాలకు స్క్రిప్ట్ రైటర్, డైరెక్టర్‌గా పనిచేశారు. ఈయన ఎన్నో నవలలు, షార్ట్ స్టోరీలు రాశారు. ఆయన నాలుగు సినిమాలకు నేషనల్ అవార్డులు వచ్చాయి. కొంత కాలం పాటు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించిన ఎంటీ వాసుదేవన్ నాయర్ ఆ తరువాత 1960వ దశాబ్దంలో మలయాళ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. దాదాపు 54 సినిమాలకు ఆయన స్ర్కీన్‌ప్లే అందించారు. అలాగే, పలు చిత్రాలకు కూడా డైరెక్టర్ గా వ్యవహరించారు. ఆయన దర్శకత్వం వహించిన నిర్మాల్యం, కడవు లాంటి మూవీస్ కు ఉత్తమ చిత్రం విభాగంలో జాతీయ చలనచిత్ర పురస్కారాలు వచ్చాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com