IPL : కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన రిషబ్

IPL 2024లో ప్రతి మ్యాచ్ ఓ ఫైనల్ లా ఉంటోంది. 40వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్- గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ 43 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో అజేయంగా 88 పరుగులు చేశాడు. గుజరాత్ ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మ బౌలింగ్‌లో పంత్ భారీగా పరుగులు పిండుకున్నాడు. IPL చరిత్రలో ఒక్క మ్యాచ్‌లో ఏ బ్యాట్స్‌మెన్ కూడా ఒక బౌలర్ బౌలింగ్ భారీగా పరుగులు సాధించలేదు.
పంత్ కంటే ముందు RCB జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ 2013 సంవత్సరంలో ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో విధ్వంసం సృష్టించాడు. ఉమేష్ యాదవ్ వేసిన 17 బంతుల్లో కోహ్లీ 52 పరుగులు చేశాడు. ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత రిషబ్ పంత్ చరిత్ర సృష్టించి విరాట్ కోహ్లీ రికార్డును బద్దలుకొట్టాడు. మోహిత్ శర్మ వేసిన 18 బంతుల్లో రిషభ్ పంత్ 62 పరుగులు పిండుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఏ బౌలర్‌పైనైనా ఒక మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ చేసిన అత్యధిక పరుగులు ఇవే. మరోవైపు.. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా మోహిత్ శర్మ నిలిచాడు. మోహిత్ శర్మ నాలుగు ఓవర్లలో మొత్తం 73 పరుగులు ఇచ్చాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com