RRR Re-Release : ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్‌కు డేట్ ఫిక్స్

RRR Re-Release : ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్‌కు డేట్ ఫిక్స్

ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సినిమాను మే 10న రీ రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. తెలుగు, హిందీ భాషల్లో 2D, 3D ఫార్మాట్‌లో రిలీజ్ కానుంది. రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీలో అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. కీరవాణి మ్యూజిక్ అందించారు.

ఈ చిత్రం 2022, మే 6న విడుదలై బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.1200 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. కాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమాతో రామ్‍చరణ్, ఎన్టీఆర్‌ ఏకంగా గ్లోబల్ స్టార్స్ గా మారారు.

హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్‍బర్గ్ వంటి చాలా మంది ప్రముఖులు ఆర్ఆర్ఆర్ చిత్రంపై ప్రశంసలు కురిపించారు.ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. అలాగే ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లోనూ ఆర్ఆర్ఆర్ మూవీ సత్తా చాటింది.ఈ మూవీలోని నాటునాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి ,అలాగే లిరిక్ రైటర్ చంద్రబోస్ కు ఆస్కార్ అవార్డు లభించింది .

ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఎంఎం కీరవాణి అందించిన సంగీతం కూడా అద్భుతం అనిపించింది. నాటునాటుకు గాను కీరవాణితో పాటు లిరిక్ రైటర్ చంద్రబోస్ కూడా ఆస్కార్ అందుకున్నారు. ఈ మూవీకి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించారు. రాజమౌళి తదుపరి సూపర్ స్టార్ మహేశ్ బాబుతో యాక్షన్ అడ్వెంచర్ మూవీ తెరకెక్కించనున్నారు. ఈ గ్లోబల్ రేంజ్ మూవీ షూటింగ్ ఈ ఏడాదిలోనే మొదలుకానుంది.

Tags

Next Story