Sai Pallavi : భవిష్యత్తు లో డైరెక్టర్ గా మారుతా .. అదే నా డ్రీమ్ : సాయిపల్లవి

Sai Pallavi : భవిష్యత్తు లో డైరెక్టర్ గా మారుతా ..  అదే నా డ్రీమ్ :  సాయిపల్లవి

ఫిదా సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. సాయిపల్లవి (Sai Pallavi) . అందులో ఈ అమ్మడు నటనకి నిజంగానే సినీ అభిమానులు ఫిదా అయ్యారు. దీంతో లేడీ పవర్ స్టార్ గా ఆమెను ముద్దుగా పిలుచుకుంటున్నారు. అయితే టాలీవుడ్ లో ఈ అమ్మడు సినిమాలు వచ్చి చాలా కాలం అవుతోంది. ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తండేల్ సినిమాలో ఈ బ్యూటీ నటిస్తోంది.

తాజాగా ఒక చిట్ చాట్ పాల్గొన్న సాయి పల్లవి.. తన డ్రీమ్ గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం హీరోయిన్ గా చేస్తున్న తాను భవిష్యత్తు లో డైరెక్టర్ గా మారుతానని తెలిపింది. తన అభిరుచికి తగ్గ కథను కూడా రెడీ చేసే పనిలో నిమగ్నమైనట్లు వెల్లడించింది. ఇక హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయిపల్లవి.. మరి భవిష్యత్తులో డైరెక్టర్ గా ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story