Sai Pallavi : బాడీ షేమింగ్ తో చాలా బాధపడ్డా : సాయిపల్లవి

హీరోయిన్ల బాడీ షేమింగ్ చేస్తూ ట్రోల్స్ చేయడాన్ని నటి సాయిపల్లవి (Sai Pallavi) తప్పుబట్టింది. మన చుట్టూ ఉన్న ఆడవాళ్లే బాడీషేమింగ్ ని ఎదుర్కుంటున్నారని.. మగవాళ్లు ఎక్కువగా దాని బారిన పడటం లేదని వ్యాఖ్యానించింది. దీన్నిబట్టే సమస్య ఎక్కడుందో అర్ధం చేసుకోవచ్చని పేర్కొంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో తాను కూడా బాడీ షేమింగ్ కు గురైనట్లు గుర్తు చేసుకుంది.
ముఖంపై మెటిమలు ఎక్కువగా ఉన్నప్పుడు తనను చాలా మంది ఏడిపించారని చెప్పుకొచ్చింది. నువ్వు నటించడానికి పనికి రావు అనేవారని బాధపడింది. ప్రేమమ్ సినిమాకి ముందు వరకూ ఎంతో బాధపడినట్లు వెల్లడించింది. మేకప్ వేసుకోమని ఎంత మంది చెప్పినా వినేదాన్ని కాదని పేర్కొంది. చేసే పాత్రపైనే తప్పా.. ఎప్పుడూ మేకప్ పై దృష్టి పెట్టలేదని చెప్పుకొచ్చింది.
అందం కంటే ప్రతిభ మాత్రమే గొప్పదని బలంగా నమ్మి ముందుకెళ్లినట్లు వెల్లడించింది. విమర్శలు ఆరంభంలో బాధపెట్టినాతరువాత వాటిని అలవాటుగా మార్చుకున్నానని వివరించింది. అందం కంటే ప్రతిభ గొప్పదని నమ్మడం వల్లే బ్యూటీ ప్రొడక్ట్స్ కి బ్రాండింగ్ చేయలేదని పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com